గోధుమపిండి అప్పాలు | Wheat flour biscuits Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
3 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Wheat flour biscuits recipe in Telugu,గోధుమపిండి అప్పాలు, Indira Bhaskar
గోధుమపిండి అప్పాలుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

1

గోధుమపిండి అప్పాలు వంటకం

గోధుమపిండి అప్పాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wheat flour biscuits Recipe in Telugu )

  • గోధుమపిండి ఒక కప్పు
  • వరి పిండి ఒక కప్పు
  • బెల్లం తురుము రెండు కప్పులు
  • ఇలాచీ పొడి పావు స్పూను
  • నెయ్యి రెండు స్పూన్లు
  • నూనె డీప్ ఫ్రైకి సరిపడా

గోధుమపిండి అప్పాలు | How to make Wheat flour biscuits Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటరు నీరు పెట్టి మరిగించాలి.
  2. నీరు మరుగుతుండగా బెల్లం తురుము వేసి బాగా మరిగించాలి.
  3. దీనిని కొంచెం లేతపాకం వచ్చేవరకు మంటపై ఉంచాలి.
  4. ఇప్పుడు ఒక పళ్ళెంలో గోధుమపిండి వరి పిండి మిశ్రమాన్ని రెండు కలిసేలా కలపాలి.
  5. ఇప్పుడు మరుగుతున్న పాకాన్ని కిందకు దించి దాంట్లో గోధుమ పిండి కలిపిన మిశ్రమాన్ని బాగా కలపాలి.
  6. దీనిపైన ఇలాచీ పొడి రెండు చెంచాల నెయ్యి వేసి ముద్దలా చేయాలి.
  7. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న బిల్లల్లా చేసి పక్కన పెట్టుకోవాలి.
  8. ఇప్పుడు బాణాలిలో నూనె వేసి కాగాక ఈ బిళ్లలను వేసి చిన్న మంట మీద ఎరుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
  9. పిల్లలు పెద్దవాళ్లు ఇష్టపడే మెత్త మెత్తగా ఉండే గోధుమ పిండి అప్పాలు రెడీ.

నా చిట్కా:

వీటిని ఎప్పుడూ చిన్న మంట మీద పెట్టి వేయించాలి లేదంటే లోపల పిండిలా ఉండిపోతాయి ‌.

Reviews for Wheat flour biscuits Recipe in Telugu (1)

Lakshmi Leelavathi2 months ago

జవాబు వ్రాయండి