కరకజ్జం | Karakajjam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Karakajjam recipe in Telugu,కరకజ్జం, Sree Vaishnavi
కరకజ్జంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    21

    నిమిషాలు
  • వండటానికి సమయం

    11

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కరకజ్జం వంటకం

కరకజ్జం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karakajjam Recipe in Telugu )

  • శెనగపిండి-గ్లాసు
  • బెల్లం పొడి-గ్లాసు
  • నూనె-వేయించేందుకు సరిపడా
  • ఉప్పు-కొద్దిగా
  • నెయ్యి-రెండు చెంచాలు

కరకజ్జం | How to make Karakajjam Recipe in Telugu

  1. శెనగపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లు పోసి జంతికల పిండిలా గట్టిగా కలపాలి.
  2. బాణలిలో నూనె పోసి స్టౌపై పెట్టి వేడి చేయాలి.
  3. తర్వాత శెనగపిండి ముద్దను జంతికల గొట్టంలోకి తీసుకుని కాగుతోన్న నూనెలో జంతికల్లా వేసి బంగారు రంగు వచ్చేదాకా వేగించి తీయాలి.
  4. మరో గిన్నెలో బెల్లం పొడి తీసుకుని అది మునిగేలా నీళ్లు పోసి స్టౌపై పెట్టాలి.
  5. తర్వాత బెల్లం కరిగి ఉండపాకం వచ్చాక వేయించుకు పెట్టుకున్న జంతికల్ని చిన్న ముక్కల్లా చేసి అందులో వెయ్యాలి.
  6. ఒక నిమిషం తరువాత స్టౌ ఆపేయాలి
  7. తర్వాత పాకం పూర్తిగా జంతికలకు పట్టేలా కలిపి నెయ్యి రాసిన పళ్లెంలోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. కొంచెం చల్లారాకా ముక్కల్లా వస్తాయి.
  8. అంతే తియ్యతియ్యని కరకజ్జం రెడీ

Reviews for Karakajjam Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo