బెల్లం బూందీ లడ్డు | Jeggery bundi laddu Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  4th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jeggery bundi laddu recipe in Telugu,బెల్లం బూందీ లడ్డు, మనస్విని శెట్టి
బెల్లం బూందీ లడ్డుby మనస్విని శెట్టి
  • తయారీకి సమయం

    45

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

బెల్లం బూందీ లడ్డు వంటకం

బెల్లం బూందీ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jeggery bundi laddu Recipe in Telugu )

  • శనగపిండి 1/4 కిలో
  • బెల్లం 1/4 కిలో
  • నూనె 1/2 కిలో
  • జీడిపప్పు 50 గ్రాములు
  • నెయ్యి 50 గ్రాములు

బెల్లం బూందీ లడ్డు | How to make Jeggery bundi laddu Recipe in Telugu

  1. ముందుగా సేనగపిండి నీళ్లు వేసుకుని జారుగా కలుపుకోవాలి
  2. పొయ్యి మీద నూనె పెట్టాక, బాగా వేడెక్కిన తరువాత బూందీ సట్రం తో బూందీ వేసుకోవాలి
  3. బూందీ మరీ ఎక్కువ రంగు రాకుండా ఫొటోలో చూపిన మాదిరిగా వేయించి ఒక పేపర్ లోకి తీసుకోవాలి
  4. ఇప్పుడు బెల్లం తురుముకని పాకం పట్టుకోవాలి ,పాకం పట్టుకోవడానికి నీళ్లు చాలా తక్కువ వేసుకోవాలి
  5. బెల్లం ఉండ పాకం వచ్చాక అందులో జీడిపప్పు, నెయ్యి వేసి కలుపుని దించుకోవాలి
  6. ఈ పాకం లో ముందు తయారు చేసుకున్న బూందీ వేసి కలుపుకుని లడ్డులు చేసుకోవాలి
  7. ఈ లడ్డులు పాకం వేడిగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చల్లగా అవ్వకుండా లడ్డు గట్టిగా చుట్టుకోవాలి
  8. బెల్లం బూందీ లడ్డు సర్వింగ్ కి సిద్ధం

నా చిట్కా:

బెల్లం పాకం పట్టేప్పుడు బాగా ముదర పాకం రావాలి, నీళ్లలో పాకం వేసి చూసుకుంటే ఉండలు గా పడాలి

Reviews for Jeggery bundi laddu Recipe in Telugu (0)