బందర్ లడ్డు | Besan laddu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  5th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Besan laddu recipe in Telugu,బందర్ లడ్డు, Sree Vaishnavi
బందర్ లడ్డుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

0

0

బందర్ లడ్డు వంటకం

బందర్ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Besan laddu Recipe in Telugu )

  • పంచదార పొడి - 1కప్పు
  • సెనగపిండి - 2 కప్పులు
  • నెయ్యి - ¾ కప్పు
  • నీళ్ళు - 3 చెంచాలు
  • ఏలకుల పొడి - చిటికెడు
  • తరిగిన బాదం - 1 చెంచా
  • తరిగిన పిస్తాపప్పు - 1 చెంచా

బందర్ లడ్డు | How to make Besan laddu Recipe in Telugu

  1. వేడిపెనంలో నెయ్యి వేయండి.
  2. సెనగపిండి వేసి మాడకుండా కలుపుతూనే ఉండండి.
  3. సెనగపిండి రంగు కొంచెం మారి, పచ్చి వాసన పోయేవరకూ 10 నిమిషాలు కలుపుతూనే ఉండండి.
  4. నీళ్ళు చల్లితే పైన నురగను గమనించవచ్చు.
  5. నురగ పోయే వరకు కలుపుతూనే ఉండండి.
  6. గిన్నెలోకి దాన్ని మార్చి 10 నిమిషాలు చల్లబడనివ్వండి.
  7. పంచదార పొడిని వేసి మళ్ళీ బాగా కలపండి
  8. ఏలకుల పొడి వేసి కలపండి.
  9. తరిగిన బాదం, పిస్తాలను చెంచాడు వేసి కలపండి.
  10. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టండి.
  11. సమాన సైజులలో గుండ్రటి లడ్డూలలా చేసుకోండి.

నా చిట్కా:

నెయ్యి, సెనగపిండిల నిష్పత్తి సరిగ్గా ఉండాలి.

Reviews for Besan laddu Recipe in Telugu (0)