క్యారెట్ హల్వా | Carrot halwa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot halwa recipe in Telugu,క్యారెట్ హల్వా, Sree Vaishnavi
క్యారెట్ హల్వాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

క్యారెట్ హల్వా వంటకం

క్యారెట్ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot halwa Recipe in Telugu )

  • క్యారెట్ - ఒక కేజీ
  • పాలు - ఒకటిన్నర లీటర్
  • ఏలకులు - పది
  • నెయ్యి - తగినంత
  • పంచదార- ముప్పావు కేజీ
  • ఎండు ద్రాక్షలు - గుప్పెడు
  • బాదం - గుప్పెడు
  • జీడిపప్పులు - గుప్పెడు

క్యారెట్ హల్వా | How to make Carrot halwa Recipe in Telugu

  1. ముందుగా క్యారెట్లను శుభ్రం చేసుకుని.. తురుముకోవాలి
  2. కేజీ క్యారెట్లను తురుముకుని పక్కనబెట్టుకోవాలి.
  3. ఆపై ఒకటిన్నర లీటర్ పాలను స్టౌమీద వుంచి.. ఆ పాలు లీటర్ వచ్చేంత వరకు బాగా మరిగించాలి.
  4. అలా పాలు బాగా మరిగి.. చిక్కబడ్డాక అందులో క్యారెట్ తురుము చేర్చాలి.
  5. ఈ క్యారెట్ తురుము బాగా ఉడికేంతవరకు మూతపెట్టి సన్నని సెగపై వుంచాలి.
  6. క్యారెట్ మెత్తగా ఉడికిన తర్వాత యాలకుల పొడిని చేర్చాలి.
  7. ఈ క్యారెట్ తురుమును సన్నని సెగపై ముప్పై నుంచి నలభై నిమిషాలపాటు ఉడికించాలి.
  8. ఇలా పాలు, క్యారెట్ తురుము బాగా ఉడికి హల్వా లాంటి పక్వానికి వచ్చేదాక స్టౌమీదే వుంచాలి.
  9. తర్వాత నెయ్యి, పంచదార, వేయించిన ఎండు ద్రాక్షలు, బాదంపప్పుల పలుకులు వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
  10. తర్వాత దించేయాలి. అంతే క్యారెట్ హల్వా రెడీ

Reviews for Carrot halwa Recipe in Telugu (0)