మాంగో కోకనట్ జెల్లీ కేక్. | Mango coconut jelly cake. Recipe in Telugu

ద్వారా Swapna Tirumamidi  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango coconut jelly cake. recipe in Telugu,మాంగో కోకనట్ జెల్లీ కేక్., Swapna Tirumamidi
మాంగో కోకనట్ జెల్లీ కేక్.by Swapna Tirumamidi
 • తయారీకి సమయం

  15

  గంటలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

6

0

మాంగో కోకనట్ జెల్లీ కేక్. వంటకం

మాంగో కోకనట్ జెల్లీ కేక్. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango coconut jelly cake. Recipe in Telugu )

 • అగర్ అగర్ (చైనా గ్రాస్)....30 గ్రా"
 • తియ్యని మామిడి పండు...పెద్ద పండు 1
 • పంచదార 250 గ్రా..
 • కొబ్బరి పాల పొడి ( కోకనట్ మిల్క్ పౌడర్)...75 గ్రా..
 • చిక్కని పాలు...ఒక గరిటెడు..
 • ఫ్రెష్ ఆరంజ్ జ్యూస్ 100 ml.
 • మామిడి పండు ముక్కలు చిన్నగా కట్ చేసినవి....ఒక కప్పుడు.

మాంగో కోకనట్ జెల్లీ కేక్. | How to make Mango coconut jelly cake. Recipe in Telugu

 1. అగర్ అగర్ ని రెండు భాగాలుగా అంటే 20 గ్రాములు. 10 గ్రాములు ఉండేలా చేసి విడి విడి గా చేసి ,నీరు పోసి 15 నిమిషాలు నాన పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు మామిడి పండుని చెక్కు తీసి ముక్కలుగా చేసి, కొన్ని ముక్కలు చిన్నవిగా కట్ చేసి విడిగా పెట్టుకుని... మిగిలిన ముక్కలు అన్ని మిక్సీలో జార్ లో వేసి, ఆరంజ్ జ్యూస్,కొంచం నీరు కూడావేసి మెత్తగా చేసుకోవాలి.
 3. ఇప్పుడు కొబ్బరిపాల పొడిని చిన్న గిన్నీలోకి వేసి, గారిటపాలు వేసి చెంచాతో ఉండలు లేకుండా పేస్ట్ లా చేసుకోవాలి అవసరం ఐతే కొడిగా నీరు కూడా వేసుకోవచ్చు.
 4. ఇప్పుడు ఒక మందపాటిది ,కాస్త పెద్ద గిన్ని లో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో నానపెట్టిన 20 గ్రా...అగర్ అగర్ వేసి మీడియం మంట మీద ఉంచి 10 నిముషాలు కలుపుతూ ఉండాలి....అగార్ అగార్ అంతా కరిపోతుంది.
 5. ఇప్పుడు మంట తగ్గించి ,150 గ్రా పంచదార వేసి కరిగిన తరువాత మాంగో జ్యూస్ అందులోవేసి మళ్ళీ 10 నిముషాలు బాగా కలపాలి. (అగార్ అగార్ ,మాంగో రెండు కలిసిపోవాలి విడిపోకూడదు..ఒకవేళ విడిపోతే మంట ఆపి , హాండ్ బ్లెండేర్ తో మిక్స్ చేయచ్చు..అప్పుడు ఒక్కనిమిషం మంట మీద ఉంచితే చాలు..వేడిగా ఉంటుంది కాబట్టి మీద తుళ్ళకుండా చూసుకోండి.)
 6. ఒక నున్నని గాజు స్క్వేర్ కేక్ ట్రే తీసుకుని అందులోకి మాంగో మిశ్రమాన్ని మెల్లిగా పోయాలి. బుడగలు లాంటివి ఉంటే టూత్ పిక్ సాయంతో తొలగించండి.
 7. ఈ మాంగో మిశ్రమం లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు... మునిగేలా ఒక్కొక్కటి గా వేసి ..మూత పెట్టకుండా ఫ్రిజ్ లో పెట్టాలి...
 8. ఇప్పడు మళ్ళీ ఒక గిన్ని తీసుకుని అందులో 10 గ్రాములు నానపెట్టిన అగర్ అగర్ వేసి కప్పున్నర నీళ్లు వేసి కరిగేదాకా మరిగించి అప్పుడు , పంచదార 100గ్రా..వేసి కరిగాక, రెడీ చేసుకున్న కొబ్బరిపాల మిశ్రమం వేసి కలుపుకోవాలి..(మామిడి జ్యూస్ కానీ, కొబ్బరి పాలు కానీ వేసేటప్పుడు కానీ మంట చాలా సన్నగా పెట్టి మాత్రమే కలపాలి...లేకపోతే విరిగి పోతాయి.)
 9. ఇప్పుడు మాంగో జెల్లీ ని బయటకు తీసి,సెట్ అయ్యిందో లేదో చేతితో తాకి చూసుకుని (చేతికి అంటకుండా ఉండాలి)...అప్పుడు... ఈ కొబ్బరి పాల మిశ్రమాన్ని మెల్లగా ఆ మాంగో జెల్లీ మీద పోయాలి.....మళ్ళీ టూత్ పిక్ సాయంతో బుడగలు ఉంటే తీసేసి.... కొద్ది సేపు ఆగక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి...
 10. రెండున్నర గంటలు పోయాక బయటకి తీసి ముక్కలుగా కట్ చేసుకుని నచ్చిన టోప్పింగ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి...ఇంటివారి, అతిధుల మనసులు గెలుచుకోండి.
 11. మీరు పిక్ లో చూస్తున్న టాపింగ్స్ మాంగో జెల్లీతో నాకు తోచిన విధంగా చేసినవి....మీరు కావాలంటే వేరే ఏమైనా వాడుకోవచ్చు.

నా చిట్కా:

పంచదార మీ రుచికి తగిన విధంగా కొంచం ఎక్కువ తక్కువ గా వేసుకోవచ్చు..ఇదే కొలత అవసరం లేదు.

Reviews for Mango coconut jelly cake. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo