ఎర్ర గుమ్మడికాయ హల్వా | Red pumpkin halwa Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  8th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red pumpkin halwa recipe in Telugu,ఎర్ర గుమ్మడికాయ హల్వా, Indira Bhaskar
ఎర్ర గుమ్మడికాయ హల్వాby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

ఎర్ర గుమ్మడికాయ హల్వా వంటకం

ఎర్ర గుమ్మడికాయ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red pumpkin halwa Recipe in Telugu )

  • ఎర్ర గుమ్మడికాయ ముక్కలు రెండు కప్పులు
  • పంచదార లేదా బెల్లం తురుము ఒక కప్పు
  • పాలు పావు కప్పు
  • నెయ్యి నాలుగు చెంచాలు
  • జీడిపప్పు బాదాం ముక్కలు కొన్ని
  • కిస్మిస్ ఒక చెంచాడు
  • ఇలాచీ పొడి పావు చెంచా

ఎర్ర గుమ్మడికాయ హల్వా | How to make Red pumpkin halwa Recipe in Telugu

  1. ముందుగా ఎర్రగుమ్మడికాయ ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాలి.
  2. ఇప్పుడు దీనిని బాగా ఉడికాక ముద్దలా చేసి పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మందపాటి మూకుడు పెట్టి నెయ్యి వేసి అందులో పైన ఉడకపెట్టుకొన్న గుమ్మడికాయ ముద్ద వేసి వేగనివ్వాలి.
  4. పాలను కూడా వేసి వుడకనివ్వాలి.
  5. ఇది కొంచెం సేపు వేగాక పంచదార లేదా బెల్లం తురుము వేసి ఉడకనివ్వాలి.
  6. ఇప్పుడు పంచదార పాకంలా వచ్చి మన వేసిన నెయ్యి అంతా పైకి వచ్చాక అందులో ఇలాచి పౌడర్ బాదం జీడిపప్పు కిస్మిస్ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ..

నా చిట్కా:

దీనిని గుమ్మడికాయ తురుముతో కూడా చేసుకోవచ్చు. చిన్నమంటమీద చేయాలి.

Reviews for Red pumpkin halwa Recipe in Telugu (0)