కొబ్బరి పొంగలి | Coconut pongal Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut pongal recipe in Telugu,కొబ్బరి పొంగలి, Indira Bhaskar
కొబ్బరి పొంగలిby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

కొబ్బరి పొంగలి వంటకం

కొబ్బరి పొంగలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut pongal Recipe in Telugu )

  • కొబ్బరి పాలు 2 కప్పులు
  • బియ్యం 1 కప్పు
  • పెసరపప్పు 1/4 కప్పు
  • బెల్లం తురుము 1 కప్పు
  • నెయ్యి 5 చెంచాలు
  • పచ్చకర్పూరం చిటికెడు
  • జీడిపప్పు 10
  • కిస్మిస్ 15
  • యాలకుల పొడి 1/4 చెంచా

కొబ్బరి పొంగలి | How to make Coconut pongal Recipe in Telugu

  1. ముందుగా పెసరపప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కొబ్బరిని మిక్సీలో వేసి కొబ్బరిపాలు తయారుచేసుకోవాలి.
  3. ఇప్పుడు బియ్యం పెసరపప్పు కప్పున్నర కొబ్బరి పాలు ,తగినన్ని నీళ్లు కలిపి ప్రెజర్ కుక్కర్లో పెట్టి పొడిపొడిగా ఉండేలా ఉడికించుకోవాలి.
  4. ఇప్పుడు బెల్లం తురుముకుని బాండీలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి పాకం వచ్చేవరకు పాకం పట్టాలి.
  5. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో పైన ఉడికించిన పప్పు అన్నాన్ని వేసి, 3 చెంచాల నెయ్యి వేసి కలుపుతూ ఉడకనివ్వాలి.
  6. ఇందులో చిటికెడు పచ్చకర్పూరం, యాలకుల పొడి కూడా వేసి ఉడకనివ్వాలి.
  7. ఇప్పుడు ఒక బాండీలో రెండు చెంచాలు నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకోవాలి.
  8. ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పులను పై మిశ్రమంలో వేసి వేడివేడిగా నెయ్యితో సర్వ్ చేసుకుంటే కొబ్బరి పొంగలి రెడీ.

నా చిట్కా:

ఇందులో ఎండు కొబ్బరిని కూడా నేతిలో వేయించి కలుపుకోవచ్చు.

Reviews for Coconut pongal Recipe in Telugu (0)