మునక్కాయ సాంబార్ | MUNAKKAAYA saambhaar Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MUNAKKAAYA saambhaar recipe in Telugu,మునక్కాయ సాంబార్, Kavitha Perumareddy
మునక్కాయ సాంబార్by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

మునక్కాయ సాంబార్ వంటకం

మునక్కాయ సాంబార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MUNAKKAAYA saambhaar Recipe in Telugu )

  • మునక్కాయ లు నాలుగు
  • కంది పప్పు 150 గ్రామ్స్
  • టమాటాలు 2
  • ఉల్లిగడ్డ 1
  • .పచ్చిమిర్చి 3
  • చింతపండు కొద్దిగా.
  • ఉప్పు తగినంత.
  • కరేపాకు 2 రెమ్మలు
  • కొత్తిమీర గుప్పెడు
  • పోపుగింజెలు 1 స్పున్
  • నూనె పెద్ద స్పున్ 1
  • ఎండుమిర్చి ,2
  • వెల్లుల్లి 5రెబ్బలు
  • సాంబార్ పొడి చిన్న స్పున్
  • పసుపు పావు స్పున్

మునక్కాయ సాంబార్ | How to make MUNAKKAAYA saambhaar Recipe in Telugu

  1. ముందుగా కందిపప్పు కడిగి ఒక 15 నిముసాలు నానబెట్టాలి.
  2. పప్పు నానేలోపు ములక్కాడలు పీచు తీసి 2 ఇంచుల ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .మిగతా కూరగాయలు అన్ని పొడవుగా తరుక్కోవాలి.
  3. ఇప్పుడు కందిపప్పు ను కొంచెం పసుపు, నాలుగు చుక్కలు నూనె వేసి ఉడికించి మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టుకొని నూనె వేసికాగిన తరువాత ,పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి,కరేపాకు వేసుకొని వేగినతరువాత
  5. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగినతారువాత టమాటాలు వేసుకోవాలి.ఇవికొద్దిగా మగ్గిన తరువాత మునక్కాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి కాసేపు అంటే 5 నిముసాలు పాటు వేయించాలి.
  6. ఇప్పుడు దానిలో పప్పు ను వేయాలి తగినంత నీళ్లు పోసుకొని అంత కలపాలి .నానబెట్టిన చింతపండు రసం తీసి కలుపుకోవాలి.సాంబార్ పొడి వేయాలి. మరుగుతున్న సాంబార్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడు మంచి సువాసన వస్తుంది.
  7. ఒక15 నిముసాలు సాంబార్ ని ఉడికించాలి .మునక్కాయలు ఉడికే వరకు ఉడికించాలి.
  8. ఇక స్టవ్ ఆఫ్ చేసి వడ్డించే గిన్నెలోకి తీసుకొని మిగిలిన కొత్తిమీర తో అలంకరించాలి. అంతే ఇంకా మునక్కాయ సాంబార్ రెడీ .

నా చిట్కా:

కందిపప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా నూనె వేస్తే ఎక్కువగా పొంగి పోకుండా ఉడుకుతుంది.

Reviews for MUNAKKAAYA saambhaar Recipe in Telugu (0)