వేపుడు జావ | Vepudu java Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vepudu java recipe in Telugu,వేపుడు జావ, మనస్విని శెట్టి
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

వేపుడు జావ వంటకం

వేపుడు జావ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vepudu java Recipe in Telugu )

  • బియ్యం ఒక కప్పు
  • నెయ్యి రెండు స్పూన్లు
  • శొంఠి 100 గ్రాములు
  • ఎండుమిర్చి 50 గ్రాములు
  • పెరుగు రెండు కప్పులు
  • నీళ్లు నాలుగు కప్పులు
  • ఉప్పు మూడు స్పూన్లు

వేపుడు జావ | How to make Vepudu java Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద కాడయి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు బియ్యం వేసి సన్నని మంట పై వేయించాలి
  3. బియ్యం కొంచెం బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  4. బియ్యం వేగిన తరువాత ఒక గిన్నెలో తీసుకోవాలి
  5. ఇప్పుడు అదే కాడయి లో శొంఠి వేసి వేయించాలి
  6. శొంఠి పగుళ్లు వచెప్పుడు ఎండుమిర్చి కూడా వేయాలి
  7. ఇప్పుడు బియ్యం ని మిక్సీ లో సన్నగా రవ్వల చేసుకోవాలి
  8. తరువాత మిక్సీ లో శొంఠి,ఎండుమిర్చి వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి
  9. ఈ శొంఠిపొడి లో తగినంత ఉప్పు వేయాలి
  10. ఇప్పుడు కాడయి లో నెయ్యి వేయాలి
  11. నెయ్యి వేడెక్కిన తరువాత నీళ్లు వేయాలి
  12. నీళ్లు పోసిన తరువాత బియ్యం రవ్వ వేయాలి
  13. రవ్వ ఉడికేవరకు జావ చేయాలి
  14. తరువాత పెరుగు లో నీళ్ళు వేసి ,శొంఠిపొడి, ఉప్పు వేసి మజ్జిగ లా చిలకాలి
  15. ఈ శొంఠి మజ్జిగ ని జావలో కలపాలి
  16. వేపుడు జావ సిద్ధం

Reviews for Vepudu java Recipe in Telugu (0)