కాయ ఆవకాయ | Kaya avakaya Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kaya avakaya recipe in Telugu,కాయ ఆవకాయ, Sree Vaishnavi
కాయ ఆవకాయby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    2

    1 /2గంటలు
  • వండటానికి సమయం

    12

    గంటలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కాయ ఆవకాయ వంటకం

కాయ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaya avakaya Recipe in Telugu )

  • చిన్న మామిడికాయలు 6-8
  • ఆవపిండి 1 కప్
  • ఉప్పు 1 కప్
  • కారం 1 కప్
  • నూనె 2 కప్పులు
  • వెల్లులిపాయలు 1/2 కప్
  • మెంతులు 2 చెంచాలు
  • పసుపు 5 చెంచాలు

కాయ ఆవకాయ | How to make Kaya avakaya Recipe in Telugu

  1. ముందుగా మామిడికాయలిని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. తుడుచుకున్న తరువాత దానిని వంకాయ ని గుత్తిలా ఎలా తరుగుకుంటామో ఆలా తరుగుకొని మధ్యలో జీడి తీసేయాలి
  3. తరువాత దానిని పక్కన పెట్టుకోవాలి
  4. ఈలోపు ఒక పెద్ద పళ్ళెం లో ఉప్పు కారం ఆవపిండి మెంతులు పసుపు వెల్లులి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. కలుపుకున్న తరువాత అందులో కొంచెం నూనె వేసి ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలి
  6. ఇప్పుడు ఆ మిశ్రమం ని మామిడికాయలలో కురుకోవాలి
  7. దానిని మూడు రోజులు ఉరనివ్వాలి తరువాత నూనె ని కాచి చల్లరిచి అందులో పోసుకుని ఒక రోజు ఆగాక తినడమే

Reviews for Kaya avakaya Recipe in Telugu (0)