నిమ్మకాయ పులిహోర | LEMON rice Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • LEMON rice recipe in Telugu,నిమ్మకాయ పులిహోర, Kavitha Perumareddy
నిమ్మకాయ పులిహోరby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

నిమ్మకాయ పులిహోర వంటకం

నిమ్మకాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make LEMON rice Recipe in Telugu )

  • .బియ్యము అరకేజీ
  • నిమ్మకాయ లు 3
  • పోపుగింజెలు 2 స్పూన్స్
  • వేరుశనగ పప్పులు 3 స్పూన్స్
  • పసుపు అర స్పున్
  • పచ్చిమిర్చి 5
  • ఎండుమిర్చి4
  • నూనె 3 స్పూన్స్
  • కరివేపాకు రెండు రెమ్మలు
  • ఉప్పు తగినంత

నిమ్మకాయ పులిహోర | How to make LEMON rice Recipe in Telugu

  1. ముందుగా బియ్యము కడిగి కాసేపు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యము ఐతే రెండుగ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి .ముందు ఎక్కువ మంట మీద సగం ఉడికిన తరువాత చిన్న మంట మీద మగ్గించాలి.
  3. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని వెడల్పాటి అంటే బేసిన్ లాంటిది దానిలో వేసి చల్లార్చుకోవాలి.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి కాగినతరువాత పోపుగింజెలు,వేరుశెనగ పప్పులు కొద్దిగా వేగినతారువాత... ఎండుమిర్చి, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, వేసుకొని వేగినతారువాత కరివేపాకు, పసుపు,తగినంత ఉప్పు వేసి కలిపి కలుపుకోవాలి.
  5. నిమ్మకాయలు విత్తనాలు లేకుండా రసం పిండుకోవాలి. వేయించిన పోపుని ,నిమ్మకాయ రసం ని అన్నంలో వేసి అంతా సమంగా కలిసేలా కలుపుకోవాలి.
  6. అంతే ఇక నిమ్మకాయ పులిహోర తినడానికి రెడీ.

నా చిట్కా:

నిమ్మకాయ రసం ని పోపులో వేసి వేడి చేయకూడదు .ఎందుకంటే చేదు వస్తుంది.అన్నంలోనే కలుపుకోవాలి.

Reviews for LEMON rice Recipe in Telugu (0)