వంకాయ అంటు పులుసు. | Vankaya antu pulusu Recipe in Telugu

ద్వారా Lakshmi Leelavathi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vankaya antu pulusu recipe in Telugu,వంకాయ అంటు పులుసు., Lakshmi Leelavathi
వంకాయ అంటు పులుసు.by Lakshmi Leelavathi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

వంకాయ అంటు పులుసు. వంటకం

వంకాయ అంటు పులుసు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vankaya antu pulusu Recipe in Telugu )

  • వంకాయలు 1 /2 కేజీ
  • ఉల్లిపాయలు 4
  • నూనె 3 టేబుల్ స్పూన్లు
  • మెంతులు 5
  • ఆవాలు చిటికెడు
  • జీలకర్ర చిటికెడు
  • ఇంగువ చిటికెడు
  • ఉప్పు రుచికి సరిపడా
  • కారం 2 స్పూన్లు
  • బెల్లం కొంచెం రుచికి తగినట్లుగా
  • కరివేపాకు కొంచెం
  • కొత్తిమీర కొంచెం
  • చింతపండు నిమ్మకాయంత

వంకాయ అంటు పులుసు. | How to make Vankaya antu pulusu Recipe in Telugu

  1. ముందుగా వంకాయలను తీసుకుని పుచ్చులు లేకుండా చూసుకుని పొడవుగా తరిగి ఉప్పు నీటిలో వేసుకోవాలి.
  2. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. తర్వాత బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో 3 చెంచాల నూనె వేసుకోవాలి.
  4. నూనె కాగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,మెంతులు వేసుకుని పోపు పెట్టుకోవాలి.తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి పచ్చి వాసన పోయేదాక వేయించుకోవాలి.
  5. తర్వాత అందులో వంకాయ ముక్కల్ని వేసుకొని తిప్పి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి.ఉప్పు వేసుకోవడం వలన వంకాయలు కాండ్ర ఎక్కకుండా ఉంటాయి.
  6. తర్వాత చింతపండు ఒక నిమ్మకాయంత తీసుకుని నాన పెట్టుకోవాలి.
  7. తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుసు పోసి ఉప్పు ,కారం,కొంచెం ఇంగువ,కరివేపాకు,కొత్తిమీర వేసుకొని మూటపెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా సన్నని మంట పై ఉడకనివ్వాలి.
  8. పులుసు బాగా దగ్గిర పడిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి.ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ అపుకోవడమే.అంతే ఎంతో తేలికైన వంకాయ అంటు పులుసు రెడి .

నా చిట్కా:

ఈ పులుసు ముద్దపప్పుతో తింటే చాలా బాగుంటుంది.

Reviews for Vankaya antu pulusu Recipe in Telugu (0)