మిక్స్డ్ వెజ్ కుర్మా | MIXED VEG KURMA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MIXED VEG KURMA recipe in Telugu,మిక్స్డ్ వెజ్ కుర్మా, Ram Ram
మిక్స్డ్ వెజ్ కుర్మాby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

మిక్స్డ్ వెజ్ కుర్మా వంటకం

మిక్స్డ్ వెజ్ కుర్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MIXED VEG KURMA Recipe in Telugu )

  • వంకాయలు 2
  • క్యారెట్ 1
  • ఆలూ 1
  • బీన్స్ 4
  • గోబి 1/4కప్పు
  • భటాని 1/4కప్పు
  • క్యాప్సికమ్ 1 చిన్నది
  • ఆవాలు 1స్పూన్
  • లవంగాలు 4
  • టమాటో ముక్కలు 1కప్పు
  • కరివేపాకు కొద్దిగా
  • కొబ్బరి పాలు 1/2 కప్పు
  • ఉప్పు సరిపడా
  • పసుపు 1/4స్పూన్
  • దనియా జీరా పొడి 1 స్పూన్
  • కారం 2స్పూన్లు
  • ఫ్రెష్ క్రీమ్ 1స్పూన్

మిక్స్డ్ వెజ్ కుర్మా | How to make MIXED VEG KURMA Recipe in Telugu

  1. ముందుగా వంకాయలకి నూనె రాసి స్టవ్ మీద కాల్చుకోవాలి..భటానిలను ఉడికించాలి..
  2. ఇప్పుడు కూరగాయ ముక్కలు అని కోసి పెట్టుకోవాలి..
  3. స్టవ్ మీద కడై పెట్టి నూనె వేసి వేడి అయ్యాక..లవంగాలు ఆవాలు కరివేపాకు వేసి వేగనివ్వాలి..
  4. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి వేయించి 1స్పాన్ దనియా జీరా పొడి పసుపు కారం వేసి వేయించాలి..
  5. టమాటో ముక్కలు మగ్గినతర్వాత నీళ్లు వేయి నీళ్లు మరగటం మొదలు ఐన తర్వాత..కూరగాయ ముక్కలు అన్ని వేసుకోవాలి..భటానిలను కూడా వేసుకోవాలి..
  6. చిన్న సెగ మీద మూత పెట్టి కూరగాయ ముక్కల్ని ఉడికించాలి..
  7. ఈలోపు మనం ముందుగా కాల్చిన వంకాయలు పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి చిన్న అల్లం ముక్క కూడా వేసి మిక్సీ పత్తి పేస్ట్ రెడి చేసుకోవాలి..
  8. ఆ పేస్ట్ ని వుడుకుతున్న కురగయముక్కలలో వేసి అంతా బాగా కలుపుకోవాలి..
  9. ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి..ఇప్పుడు 1/2కప్పు కొబ్బరిపాలు వేసి సరిపడా ఉప్పు వేసి..ఇంకా ఉడికించాలి..
  10. కూర దగ్గర పడేంత వరకు ఉడికించాలి..చివారిలోఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి..
  11. వెజ్ కుర్మా రెడి..

Reviews for MIXED VEG KURMA Recipe in Telugu (0)