మొక్క జొన్న ఉప్పుడు పిండి | CORN UPMA Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CORN UPMA recipe in Telugu,మొక్క జొన్న ఉప్పుడు పిండి, Sandhya Rani Vutukuri
మొక్క జొన్న ఉప్పుడు పిండిby Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మొక్క జొన్న ఉప్పుడు పిండి వంటకం

మొక్క జొన్న ఉప్పుడు పిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CORN UPMA Recipe in Telugu )

  • మొక్క జొన్న కంకి గింజలు 3కప్పులు(2కంకులు)
  • పచ్చి మిర్చి 3
  • ఉప్పు 1 చిన్న చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • వెల్లుల్లి రెబ్బలు 2
  • కరివేపాకులు 2
  • నూనె 1/2 కప్పు

మొక్క జొన్న ఉప్పుడు పిండి | How to make CORN UPMA Recipe in Telugu

  1. లేత, ముదురు కానీ 2 కంకుల గింజలు తీసుకోవాలి.
  2. మిక్సీ లో మిర్చి,ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు, గింజలు వేసి తిప్పాలి
  3. మెత్త గా కాకుండా, కొంచెం బరకగా రుబ్బాలి.(పాలు కారే లేత వి వొద్దు)
  4. పొయ్యి పైన మూకుడు పెట్టి, జీలకఱ్ఱ 2 కరివేపాకులు వేసి, వేగాక ఈ ముద్ద వేయాలి.
  5. చిన్న మంట పై ఉంచి, 3 ని.ల తరువాత పూర్తిగా కలియపెట్టాలి
  6. ఇంకో 3 ని.ల తరువాత మళ్ళీ కలిపి దోరగా వేయించు కోవాలి.
  7. చిన్న మంట పైన ఉంచి ఇలా కొంచెం ఎరుపు వచ్చే దాకా కలపండి.
  8. అంతే మీ ఉప్పుడు పిండి తయారు. దీన్ని వేడి పాల తో కానీ, ఉత్త గా కానీ తినవొచ్చు.

నా చిట్కా:

ఈ వంట కు కంకి ని ఎన్ను కోవడం, చాలా ముఖ్యం. బాగా తెల్లవి, బాగా ఎర్రవీ ఎంచుకోవొద్దు.

Reviews for CORN UPMA Recipe in Telugu (0)