కట్టు పొంగలి | Pongali Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pongali recipe in Telugu,కట్టు పొంగలి, Sree Vaishnavi
కట్టు పొంగలిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కట్టు పొంగలి వంటకం

కట్టు పొంగలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pongali Recipe in Telugu )

  • బియ్యం  -  1 కప్పు.
  • పెసరపప్పు 1/2 కప్పు
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర 2 చెంచాలు
  • మిరియాలు 1 చెంచా
  • పచ్చిమిర్చి 1-2
  • నెయ్యి 1/4 కప్
  • నీళ్లు 4 గ్లాసులు
  • అల్లం ముక్కలు 1/2 చెంచా
  • పసుపు చిటికెడు
  • జీడిపప్పు 5-6
  • కరివేపాకు 1 రెమ్మ

కట్టు పొంగలి | How to make Pongali Recipe in Telugu

  1. ముందుగా ఒక కుక్కర్ లో పెసరపప్పు, బియ్యం, నీళ్లు, కొంచెం మిరియాలు, నెయ్యి వేసి మూత పెట్టి ఒక 3-4 కూతలు వచ్చేవరకు ఉండాలి
  2. కుక్కర్ చల్లారిన తరువాత మూత తీసుకుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి
  3. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  4. నెయ్యి కరిగిన తరువాత అందులో జీలకర్ర ,మిరియాలు, జీడిపప్పు ,పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ ,కరివేపాకు వేసి వేయించి దానిని పొంగలి మిశ్రమం లో వేసి బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే

Reviews for Pongali Recipe in Telugu (0)