నిమ్మకాయ పులిహోర | Lemon rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lemon rice recipe in Telugu,నిమ్మకాయ పులిహోర, Sree Vaishnavi
నిమ్మకాయ పులిహోరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    12

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

నిమ్మకాయ పులిహోర వంటకం

నిమ్మకాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon rice Recipe in Telugu )

  • నిమ్మకాయ రసం 4-5 చెంచాలు
  • ఎండుమిరపకాయలు 3-4
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • పచ్చిమిర్చి 6-7
  • అల్లం 1 చెంచా
  • అన్నం 1 కప్
  • నూనె 3-4 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఇంగువ చిటెకెడు
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • పల్లీలు 3 చెంచాలు
  • జీడిపప్పు 5-6

నిమ్మకాయ పులిహోర | How to make Lemon rice Recipe in Telugu

  1. ముందుగా అన్నం లో నూనె పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. తరువాత ఒక మూకుడులో నూనె వేసి కాచుకోవాలి కాగిన తరువాత అందులో పల్లీలు వేసి వేయించాలి
  3. పల్లీలు వేగినతరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు, ఎండుమిరపకాయలు ,ఇంగువ, కాజు ,కరివేపాకు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి ,అల్లం వేసి మరోనిమిషం వేయించాలి
  5. వేగిన తరువాత అందులో నిమ్మరసం ఉప్పు వేసి 5-6 నిమిషాలు కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి
  6. ఉడికిన తరువాత దానిని పసుపు అన్నం మిశ్రమం లో వేసి బాగా కలిసేలా కలిపి సర్వ్ చేసుకోవడమే

Reviews for Lemon rice Recipe in Telugu (0)