దద్దోజనం | Daddojanam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Daddojanam recipe in Telugu,దద్దోజనం, Sree Vaishnavi
దద్దోజనంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

దద్దోజనం వంటకం

దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Daddojanam Recipe in Telugu )

  • బియ్యం - అరకప్పు
  • నీళ్లు - ఒకటిన్నర కప్పులు
  • పెరుగు - ఒక కప్పు
  • పాలు - పావు కప్పు
  • పచ్చిమిర్చి(సన్నగా తరిగి) - రెండు
  • అల్లం (సన్నగా తరిగి)- ఒకటిన్నర టీస్పూన్‌
  • ఆవాలు - ముప్పావు టీస్పూన్‌
  • పచ్చి శెనగపప్పు - ముప్పావు టీస్పూన్‌
  • మినపప్పు - అర టీస్పూన్‌
  • కరివేపాకులు - కొన్ని
  • ఇంగువ - చిటికెడు
  • నూనె - రెండు టీస్పూన్లు
  • ఎండుమిర్చి - రెండు
  • మిరియాలు 3-4

దద్దోజనం | How to make Daddojanam Recipe in Telugu

  1. బియ్యం శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. 
  2. అన్నాన్ని గరిటెతో కొద్దిగా మెత్తగా చేయాలి.
  3. అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు పోసి కలిపి చల్లారనివ్వాలి
  4. తరువాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. 
  5. పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, పచ్చి శెనగపప్పు, మినపప్పు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు పచ్చిమిర్చి, మిరియాలు ,అల్లం, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొన్ని సెకన్లు వేగించాలి. 
  6. తాలింపును పెరుగన్నంలో వేసి కలపాలి

నా చిట్కా:

నచ్చితే కొంచెం ఎక్కువ మిరియాలు వేసుకోవచ్చు

Reviews for Daddojanam Recipe in Telugu (0)