కట్టే పొంగళి | Ven pongal Recipe in Telugu

ద్వారా Sukriti Siri  |  17th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ven pongal recipe in Telugu,కట్టే పొంగళి, Sukriti Siri
కట్టే పొంగళిby Sukriti Siri
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కట్టే పొంగళి వంటకం

కట్టే పొంగళి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ven pongal Recipe in Telugu )

  • 1 గ్లాస్ : బియ్యం
  • 1/2 గ్లాస్ : పెసర పప్పు
  • 2 చెంచాల : నెయ్యి
  • 4 గ్లాసుల : మంచి నీరు
  • ఉప్పు తగినంత
  • పోపు కి : 1 పెద్ద చెంచా : నెయ్యి
  • 1 చెంచా : జీలకర్ర
  • 1/2 చెంచా : మిరియాలు
  • 1 చెంచా : మిరియాల పొడి
  • 2 : పచ్చి మిరపకాయలు
  • 1/8 చెంచా : ఇంగువ
  • 1 చెంచా : తరిగిన అల్లం
  • కరివేపాకులు కొన్ని
  • నీళ్లు పొంగళి గట్టిగా ఉంటే

కట్టే పొంగళి | How to make Ven pongal Recipe in Telugu

  1. పప్పు, బియ్యం శుభ్రం చేసుకుని బాగా కడిగి పెడుకోండి
  2. కుక్కర్ లో రెండు చెంచాల నెయ్యి వేసి కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం వేసుకొని బియ్యం తెల్ల బడి పప్పు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
  3. నీళ్లు పోసి 4 నుండి 5 కూతలు వచ్చే వరకు ఉడికించి స్టీమ్ పోయే వరకు పక్కన ఉంచుకోండి.
  4. పోపు మూకిటీలో ఒక చెంచా నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, మిరియాల పొడి, తరిగిన అల్లం, పచ్చి మిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు తో పోపు పెట్టుకోండి.
  5. కుక్కర్ మూత తీసి ఉప్పు కొన్ని నీళ్లు పోసి కలుపుకొని తయారు చేసుకున్న పోపు వేసుకొని కలుపుకుంటే కట్టే పంగలి తయారు.
  6. కొబ్బరి పుట్నాల పచ్చడి తో లేదా పచ్చి పిలుసు తో తింటే ..ఆహా !

Reviews for Ven pongal Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo