మైసూర్ రసం | Mysore rasam Recipe in Telugu

ద్వారా Sukriti Siri  |  17th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mysore rasam recipe in Telugu,మైసూర్ రసం, Sukriti Siri
మైసూర్ రసంby Sukriti Siri
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

మైసూర్ రసం వంటకం

మైసూర్ రసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mysore rasam Recipe in Telugu )

  • 1/4 కప్పు : కంది పప్పు
  • మశాల ముద్దకి : 1 చెంచా : చెనగ పప్పు
  • 1 చెంచా : ధనియాలు
  • 1 : ఎండు మిరపకాయ
  • 6 : మిరియాలు
  • 2 చెంచాల : కొబ్బరి పొడి
  • 1 చెంచా : నెయ్యి
  • 1 కప్ : పల్చటి చింత పండు రసం
  • 1/4 చెంచా : ఇంగువ
  • కరివేపాకులు కొన్ని
  • నీళ్లు సరిపడా
  • ఉప్పు తగినంత
  • 1/4 చెంచా : పసుపు
  • కోత్తిమీరు కొద్దిగా
  • పోపు కి : 1 చెంచా : నెయ్యి
  • 1 చెంచా : ఆవాలు
  • 1 చెంచా : జీలకర్ర
  • ఇంగువ చిటికెడు
  • 1 : ఎండు మిరపకాయ

మైసూర్ రసం | How to make Mysore rasam Recipe in Telugu

  1. ముందుగా కందిపప్పు ని శుభ్రం చేసి కుక్కర్ లో మెత్తగా ఉడికించి కవ్వం గుత్తి తో ఏనుపుకొని పెట్టుకోండి.
  2. పోపు మూకిటీలో ఒక చెంచా నెయ్యి వేసి చెనగ పప్పు, ధనియాలు, మిరియాలు, ఎండు మిరపకాయ,కొబ్బరి వేసి పప్పు బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించుకోండి.
  3. కాస్త చల్లార్చుకొని మిక్సీ లో మెత్తగా ఒక చెంచా నీళ్లు పోసి రుబ్బు కోండి.
  4. ఒక గిన్నెలో చింత పండు రసం, ఇంగువ, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు మరగించండి.
  5. ఇప్పుడు ఉడికించి ఏనుపుకున్న పప్పు ,రుబ్బిన మశాల వేసి కలుపుకోండి.
  6. సరిపడ నీళ్లు పోసి రసం లాగా పలుచగా చేసుకోండి.
  7. కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు మరగించండి.
  8. ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయ, ఇంగువ తో పోపు పెట్టి మారుగుతున్న రసం లో పోసుకుంటే ఘుమ ఘుమ లాడే మైసూర్ రసం రెడి.

Reviews for Mysore rasam Recipe in Telugu (0)