పాలకూర పప్పు | Spinach pappu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach pappu recipe in Telugu,పాలకూర పప్పు, Sree Vaishnavi
పాలకూర పప్పుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

పాలకూర పప్పు వంటకం

పాలకూర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach pappu Recipe in Telugu )

  • కందిపప్పు : ఒక కప్పు
  • పాల కూర : చిన్నవి ఐతే రెండు కట్టలు
  • పచ్చి మిర్చి : 6-8
  • పసుపు : అర టీ స్పూన్
  • ఉప్పు: రుచికి తగినంత
  • ఎండుమిర్చి : రెండు
  • ఇంగువ : చిటికెడు
  • జీల కర్ర : ఒక టేబుల్ స్పూన్ 
  • ఆవాలు : ఒక టేబుల్ స్పూన్   
  • ఎండుమిర్చి : రెండు
  • నీళ్లు తగినంత
  • కారం తగినంత
  • నూనె 3-4 చెంచాలు

పాలకూర పప్పు | How to make Spinach pappu Recipe in Telugu

  1. ముందుగా పాలకూరను ముక్కలుగా తరగాలి. తర్వాత పప్పుని కుక్కర్లో వేసి కడిగి అందులో ఆకుకూరముక్కలు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి.
  2. ఉడికిన ఆకుకూర పప్పులో ఉప్పు వేసి గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి బాగా మెదపాలి.
  3. తర్వాత చిన్న బాణలిలో నూనె వేసి ఒక నిమిషం తరువాత , కరివేపాకు, కారం ఎండుమిర్చి, జీల కర్ర, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. 
  4. చివరగా ఇంగువ కూడా వేసి వేయించి, పప్పులో వేసి వెంటనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి. 
  5. అంతే ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర పప్పు రెడీ.

Reviews for Spinach pappu Recipe in Telugu (0)