చింత పండు పులిహోర | Chinthapandu pulihora Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chinthapandu pulihora recipe in Telugu,చింత పండు పులిహోర, Pendekanti Suneetha
చింత పండు పులిహోరby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

చింత పండు పులిహోర వంటకం

చింత పండు పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chinthapandu pulihora Recipe in Telugu )

  • బియ్యము 1 పావు
  • నీళ్లు 2 పావులు
  • చింతపండు పెద్ద నిమ్మకాయంత
  • నూనె 8 స్పూన్స్
  • ఆవాలు ,జీలకర్ర 1 స్పూన్
  • మెంతులు 8 గింజలు
  • పచ్చిమిర్చి. 10
  • ఎండు మిర్చి 2
  • వేరుశెనగ గుళ్ళు 3 స్పూన్స్
  • మినపప్పు 2 స్పూన్స్
  • సేనగపప్పు 2 స్పూన్స్
  • బెల్లం చిన్న ముక్క
  • ఉప్పు తగినంత
  • MTR సాంబార్ పొడి 2 స్పూన్స్

చింత పండు పులిహోర | How to make Chinthapandu pulihora Recipe in Telugu

  1. చింతపండు ఒక గంటసేపు నానబెట్టి చిక్కగా రసము తీసుకోవాలి
  2. స్టవ్ పై ఒక బాణలి పెట్టి అందులో నూనె వేయాలి
  3. నూనె కాగాక అందులో ఆవాలు,జీలకర్ర,మెంతులు వేసి వేగాక సేనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ గుళ్లు వేసి బాగా వేగాక ఎండు మిర్చి, పచ్ఛిమిర్చి ,కరివేపాకు వేసి వేగాక అందులో చింతపండు రసం వేయాలి.అందులోనే ఉప్పు,బెల్లం వేసి బాగా ఉడకనివ్వాలి .
  4. నూనె పైకి తేలి బాగా ఉడకనివ్వాలి. ఉడికాక అందులో సాంబార్ పొడి వేసి కొద్దిగా ఉడికించి దించాలి.
  5. ఈ పులిహోర గుజ్జు 10 రోజులు నిలువ ఉంటుంది.
  6. అన్నం పొడి పొడిగా చేసుకొని ఈ గుజ్జు వేసి బాగా కలపాలి.
  7. రుచికరమైన పులిహోర రెడీ .

Reviews for Chinthapandu pulihora Recipe in Telugu (0)