బిసిబిళ్లబాత్ | Bisibillabath Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bisibillabath recipe in Telugu,బిసిబిళ్లబాత్, Pendekanti Suneetha
బిసిబిళ్లబాత్by Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

బిసిబిళ్లబాత్ వంటకం

బిసిబిళ్లబాత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bisibillabath Recipe in Telugu )

  • బియ్యము 1 గ్లాస్
  • కందిపప్పు అర గ్లాస్
  • చింతపండు చిన్న నిమ్మకాయంత
  • వేరుశెనగ గుళ్ళు. ఒక పిడికెడు
  • పచ్చి బటాని. 4 స్పూన్స్
  • క్యారెట్ ముక్కలు 1 కప్
  • బీన్స్. ముక్కలు అర కప్
  • ముల్లంగి ముక్కలు. అర కప్
  • పొటాటో.ముక్కలు. అర కప్
  • వంకాయ ముక్కలు అర కప్
  • ఉల్లిగడ్డముక్కలు అర కప్
  • బెల్లం చిన్న ముక్క
  • ఉప్పు తగినంత
  • బిసిబిళ్లబాత్ పౌడర్ 3 స్పూన్స్
  • ఎండు కారం 1 స్పూన్
  • ఆయిల్. 5 స్పూన్స్
  • ఆవాలు,జీలకర్ర. 1 స్పూన్
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర. 1 స్పూన్

బిసిబిళ్లబాత్ | How to make Bisibillabath Recipe in Telugu

  1. వేరుశెనగ గుళ్లను 2 గంటలు నానబెట్టాలి.
  2. బియ్యము,కందిపప్పు కలిపి బాగా కడిగి 5 గ్లాస్ నీరు పోసి రైస్ కుక్కర్ లో పెట్టాలి. అందులోనే క్యారెట్,బీన్స్,ముల్లంగి,బటాని,వేరుశెనగ గుళ్ళు వేసి బాగా కలిపి అన్ చేయాలి
  3. ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు,జీలకర్ర, ఇంగువ వేసి పొటాటో ముక్కలు,వేసి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి అవి మగ్గాక టమోటా ముక్కలు వేసి అందులో చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, బెల్లం, బిసిబిళ్లబాత్ పొడి వేస్ బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  4. రైస్ కుక్కర్ లో అన్నం, కందిపప్పు, కూరగాయలు ఉడికాక అందులో పొటాటో మిశ్రమం వేసి బాగా కలిపి కొద్దిసేపు బాగా ఉడికించాలి.
  5. ఇది టమోటా రైతా తో బాగుంటుంది

Reviews for Bisibillabath Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo