కారం ఇడ్లీ | Karam idly Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  23rd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Karam idly recipe in Telugu,కారం ఇడ్లీ, Pendekanti Suneetha
కారం ఇడ్లీby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

కారం ఇడ్లీ వంటకం

కారం ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karam idly Recipe in Telugu )

  • ఇడ్లి పిండి. 1 గిన్నె
  • పచ్చిమిర్చి. 10
  • అల్లం. చిన్న ముక్క
  • ఉప్పు తగినంత
  • నానబెట్టిన సేనగపప్పు. 2 స్పూన్స్
  • ఉల్లిపాయల ముక్కలు. 1 పెద్ద కప్
  • ఆయిల్. 2 స్పూన్స్
  • ఆవాలు,జీలకర్ర. 1 స్పూన్
  • కొత్తిమీర. కట్ చేసినది. 4 స్పూన్స్
  • సోడా పొడి. అర స్పూన్

కారం ఇడ్లీ | How to make Karam idly Recipe in Telugu

  1. పచ్చిమిర్చి,అల్లం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి
  2. ఒక బాణలిలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి.
  3. ఇడ్లి పిండిలో నానబెట్టిన సేనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, సోడాపోడి, కొతిమిర్ర, మగ్గించిన ఉల్లిపాయ ముక్కలు అన్ని వేసి బాగా కలపాలి.
  4. కలిపాక ఈ పిండిని ఇడ్లి పాత్రలలో వేసి ఉడికించాలి.
  5. కారం ఇడ్లీ రెడి.

Reviews for Karam idly Recipe in Telugu (0)