గంజి దోస ( బ్రెడ్ దోస) | Ganji dosa Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  26th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ganji dosa recipe in Telugu,గంజి దోస ( బ్రెడ్ దోస), Pendekanti Suneetha
గంజి దోస ( బ్రెడ్ దోస)by Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

3

0

గంజి దోస ( బ్రెడ్ దోస) వంటకం

గంజి దోస ( బ్రెడ్ దోస) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ganji dosa Recipe in Telugu )

  • బియ్యం 1 కేజీ
  • బియ్యం రవ్వ 1/4 గ్లాస్
  • నీళ్లు 6 పావులు
  • సగ్గుబియ్యం 2 పిడికేడ్లు
  • బెల్లం చిన్న ముక్క
  • ఉప్పు తగినంత
  • సోడాపోడి కొద్దిగా
  • ఆయిల్ దోసెలు వేయడానికి సరిపడా

గంజి దోస ( బ్రెడ్ దోస) | How to make Ganji dosa Recipe in Telugu

  1. బియ్యం బాగా కడిగి రెండు గంటలు నానబెట్టి నీరు తీసేసి బియ్యం అరబెట్టి. తడి బియ్యం మర పట్టించాలి.
  2. సగ్గుబియ్యం లో కొన్ని నీళ్లు వేసి కుక్కర్ లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి.
  3. ఒక గిన్నెలో ఆరు పావుల నీళ్లు వేసి అందులో వన్ స్పూన్ ఆయిల్, బెల్లం, చిటికెడు ఉప్పు వేసి కాగనివ్వాలి.
  4. నీళ్లు కాగాక అందులో బియ్యం రవ్వ ,ఉడికించిన సగ్గుబియ్యం వేసి బాగా కలిపి గంజి లాగా ఉదకబెట్టాలి.
  5. రాత్రి గంజి బాగా చల్లారాక మరపట్టించిన బియ్యం పిండి వేసి బాగా గట్టిగా కలిపి పెట్టాలి.
  6. ఉదయానికి పిండి బాగా లూస్ అయ్యుంటుంది.
  7. పిండి బాగాకలిపి అందులో సోడాపోడి,ఉప్పు వేసి కలపాలి.పిండిలో నీళ్లు వేయారాదు.
  8. స్టవ్ పై పెన్నాం పెట్టి ఆయిల్ వేసి మందంగా దోస వేయాలి.
  9. దోస కాలాక అటువైపు తిప్పి దోస కాల్చాలి.
  10. ఈ దోసకు పల్లి చెట్నీ , ఎర్రకారం బాగుంటాయి.

నా చిట్కా:

ఈ పిండి తొందరగా పుల్లగా కాదు. బాగా నిల్వ ఉంటుంది.

Reviews for Ganji dosa Recipe in Telugu (0)