మెత్తని చేగోడీలు | Soft chekodis Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Soft chekodis recipe in Telugu,మెత్తని చేగోడీలు, Sudha Badam
మెత్తని చేగోడీలుby Sudha Badam
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

మెత్తని చేగోడీలు వంటకం

మెత్తని చేగోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Soft chekodis Recipe in Telugu )

  • బియ్యంపిండి 1 గ్లాసు
  • నీళ్లు 1 గ్లాసు
  • నానబెట్టిన పెసరపప్పు 2 పెద్ద స్పూన్లు
  • నూపప్పు 100 గ్రాములు
  • ఉప్పు,కారం
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

మెత్తని చేగోడీలు | How to make Soft chekodis Recipe in Telugu

  1. పెసరపప్పుని 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి.
  2. స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకుని బాగా మరగనిచ్చి అందులో ఉప్పు, కారం, నానబెట్టిన పెసరపప్పు, బియ్యంపిండి వేసి కలిపి స్టవ్ ఆపేయాలి.
  3. పిండి ఎక్కువ సేపు ఉడకనివ్వకూడదు.
  4. ఉడికిన పిండి చల్లారాక ఒక పళ్ళెంలోకి తీసుకుని బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి.
  5. ఈ ఉండల్ని నూపప్పులో దొర్లించి లావు చేగోడిలా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  6. బాగా ఎర్రగా వేయించకూడదు.
  7. ఇవి మెత్తగా తింటేనే బాగుంటాయి.

నా చిట్కా:

ఇవి నిల్వ ఉండవు. ఏ రోజు చేసుకుంది ఆ రోజే తినేయాలి.

Reviews for Soft chekodis Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo