సత్యనారాయణ ప్రసాదం. | Suji halwa. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  10th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Suji halwa. recipe in Telugu,సత్యనారాయణ ప్రసాదం., దూసి గీత
సత్యనారాయణ ప్రసాదం.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

About Suji halwa. Recipe in Telugu

సత్యనారాయణ ప్రసాదం. వంటకం

సత్యనారాయణ ప్రసాదం. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Suji halwa. Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ/ గోధుమ రవ్వ : 1 కప్పు.
  • పంచదార: 2 కప్పులు
  • నెయ్యి : 1 1/2 కప్పులు
  • పాలు : 2 కప్పులు
  • నీరు : 2 కప్పులు
  • డ్రై ఫ్రూట్స్ : జీడిపప్పు, బాదాం, కిస్మిస్ అన్నీ కలిపి 1 కప్పు.
  • ఏలకుల పొడి : 1/4 చెంచా.

సత్యనారాయణ ప్రసాదం. | How to make Suji halwa. Recipe in Telugu

  1. ముందుగా బొంబాయి రవ్వ 1 చెంచాడు నెతిలో ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.
  2. ఒక ప్యాన్లో నీళ్లు పోసుకొని మరుగ నివ్వాలి.
  3. మరుగుతున్న నీటిలో వేయించిన సూజీ పోస్తూ, ఉండ కట్టకుండా బాగా కలుపుతూ వెయ్యాలి.
  4. సూజీ ఉడికిన తర్వాత పంచదార కలపాలి.అప్పుడు కాస్త పల్చన అవుతుంది.
  5. దగ్గర పడేవరకూ కలుపుతూ ఉడికించాలి.ఈ దశ లోనే పాలు కూడా వెయ్యాలి.
  6. బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత నెయ్యి, ఏలకులు పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించేయాలి. అంతే.

నా చిట్కా:

సూజీ వేయించిన తర్వాత చక్కెర కూడా అందులోనే కలిపేసి ఉంచి, నీరు మరుగుతున్నపుడు అలానే వేస్తే ఉండ కట్టదు.

Reviews for Suji halwa. Recipe in Telugu (0)