హోమ్ / వంటకాలు / పెసరపప్పు బాదుషా

Photo of Moongdal Badusha by Ram Ram at BetterButter
566
2
0.0(0)
0

పెసరపప్పు బాదుషా

Dec-20-2018
Ram Ram
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు బాదుషా రెసిపీ గురించి

పెసరపప్పు తో చేసిన ఈ బాదుషా చాలా రుచిగా ఉండడంతో పాటు పిల్లలు పెద్దలు చాలా రుచిగా తింటారు దీనిలో తీపి తక్కువగానే ఉంటుంది ఆరోగ్యానికి ఏమాత్రమూ హాని చేయదు పెసరపప్పు ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పెసరపప్పు 1/2కప్పు
  2. బొంబాయి రవ్వ 1/2 కప్పు
  3. మైదా 5 స్పూన్లు
  4. పాలు 1 కప్పులు
  5. పంచదార 1 కప్పు
  6. నీళ్లు 3 కప్పులు
  7. యాలుక పొడి 1/4 స్పూన్
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా పాన్ పెట్టి 1/2కప్పు పెసరపప్పుని నూనె లేకుండా వేయించాలి రంగు మారెవరకు వేయించాలి
  2. ఇప్పుడు వేగిన పెసరపప్పుని పక్కన పెట్టి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత నీళ్లతో కడిగి ఉంచాలి.
  3. అదే పాన్ లో 1 కప్పు పాలు 1కప్పు నీళ్లు వేసి మరిగేపుడు పెసరపప్పుని కూడా వేసుకోవాలి
  4. పెసరపప్పుని మెత్తగా ఉడికించాలి చేతితో నొక్కి చూసి మెత్తగా అయితే స్టవ్ ఆపేయా వచ్చు లేదంటే ఇంకా కొన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి
  5. ఉడికిన పెసరపప్పుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి
  6. ఇప్పుడు పాన్ పెట్టి 1కప్పు నీళ్లు వేసి మరిగిన తర్వాత అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉండ కట్టకుండా కలుపుకోవాలి
  7. ఇప్పుడు దానిలో ముందుగా చేసుకున్న పెసర పప్పు పేస్ట్ ని కూడా వేసి అంత బాగా కలిపి 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి
  8. ఇప్పుడు స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చల్లారిన మిశ్రమాన్ని 5 చెంచాల మైదా వేసి మెత్తగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి
  9. పిండిని చేతికి నూనె రాసుకుంటూ ఉండాలా చేసి చేతితో వొత్తుకుని మధ్యలో చిటికిన వేలితో నొక్కలి ఇప్పుడు టూత్ పిక్ తో గీతలు పెట్టుకోవాలి
  10. ఇలా అన్ని చేసుకుని ఒక ప్లేట్ లో అమార్చుకుని పక్కన ఒక ముకిడలో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి
  11. నూనె బాగా వేడిగా అవ్వకూడదు మధ్యస్థంలొనే పెట్టి వేయించుకోవాలి అపుడే అన్ని సమానంగా వేగుతాయి
  12. వేగిన వాటిని ఒక ప్లేట్ లో తీసుకుని పెట్టాలి.పక్కనే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 కప్పు పంచదార 2 కప్పుల నీళ్లు వేసి పాకం తయారు చేసుకోవాలి పాకం పల్చగానే ఉండాలి
  13. పాకం అయ్యిన తర్వాత వేయించిన వాటిని పాకం లో వేసుకుని యాలుక పొడి కూడా వేసుకోవాలి
  14. 5-10నిమిషాలలో అన్ని బాగా పాకం పీల్చుకుంటాయి చాలా రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర