సిరకు సిరాళం | SirakuSiralam Recipe in Telugu

ద్వారా Rajeshwari Puthalapattu  |  16th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SirakuSiralam recipe in Telugu,సిరకు సిరాళం, Rajeshwari Puthalapattu
సిరకు సిరాళంby Rajeshwari Puthalapattu
  • తయారీకి సమయం

    6

    గంటలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

సిరకు సిరాళం వంటకం

సిరకు సిరాళం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SirakuSiralam Recipe in Telugu )

  • 1. పచ్చి శెనగ పప్పు - 1 కప్పు,
  • 2.గుండు మినప - 1కప్పు,
  • 3.పచ్చి మిరపకాయలు - 4,
  • 4.అల్లం : ఒక అంగుళం ముక్క
  • 5.కరివేపాకు - 2 రెమ్మలు,
  • 6.కారం పొడి - 1/4 చెంచా,
  • 7.పసుపు - 1/4 చెంచా,
  • 8.ఉప్పు - రుచి కి సరిపడా,
  • 9.వంటసోద - చిటికెడు,
  • 10.సిర్రాకు - సన్నగా తరిగిన రెండు కట్టలు
  • 11. ఉల్లిపాయ - 1- సన్నగా తరిగినది
  • 12. ఆవాలు - 1/4 చెంచా
  • 13 మిన పప్పు -1 చెంచా,
  • 14.నూనె - 2 చెంచాలు.

సిరకు సిరాళం | How to make SirakuSiralam Recipe in Telugu

  1. 1. పప్పులను కడిగి 6 గంటల పాటు సరిపడినన్ని నీళ్ల లో నాన పెట్టండి.
  2. 2.నానిన పప్పులకు మిరప కాయలు, అలం, ఉప్పు చేర్చి బరక గా గట్టి పిండిగా రుబ్బుకోండి.
  3. 3.రుబ్బిన పిండి కి కాస్త వంట సోడా, తరిగిన ఉలిపాయ, సిరాకు కలిపి ఉంచండి.
  4. 4.ఇపుడు ఇడ్లి పాత్రలకు నూనె రాసి పిండి అందులో వేసి ఇడ్లి లా ఉడికించండి.
  5. 5. ఉడికిన ఇడ్లి ని చల్లారాక చిన్న ముక్కలుగా తరగండి.
  6. 6. మూకుట్లో తాలింపు కి సరిపడా నూనె వేసి అందులో ఆవాలు వేయండి, చిటపట లాడాకా మినపప్పు వేయండి, వేగాక కరివేపు సిరాళం మూకలు వేసి వేపండి, ఇపుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసి కలపండి.
  7. వేడి వేడి సిరకు సిరాళం రెడీ. సీమ లో దొరికే ఈ ఆకు కూర కంటి చూపుకి మేలు చేస్తుంది, పప్పు దినులుసులు పౌష్టికాహారం, ఆకుకూరలు మంచి ఐరన్, కాల్షియమ్,పీచుపదార్థాలు కలిగిన అమృతం.ఈ రెండిటి ని కలిపి తక్కువ నూనె తో ఆవిరి మీద చేసే ఈ "సిరకు సిరాళం" అల్పాహారం ఆరోగ్యప్రదాయిని.

Reviews for SirakuSiralam Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo