ఇన్స్టంట్ ఉత్తపమ్ | Instant utapatam Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  20th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Instant utapatam recipe in Telugu,ఇన్స్టంట్ ఉత్తపమ్, Tejaswi Yalamanchi
ఇన్స్టంట్ ఉత్తపమ్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

ఇన్స్టంట్ ఉత్తపమ్ వంటకం

ఇన్స్టంట్ ఉత్తపమ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant utapatam Recipe in Telugu )

  • బియ్యం పిండి 1 కప్పు
  • ఉప్మ రవ్వ 1/2 కప్పు
  • పెరుగు 1/2 కప్పు
  • ఉల్లిపాయ - 1
  • ఉప్పు రుచికి తగినంత
  • బేకింగ్ సోడా 1/8 టీస్పూన్ (ఆప్షనల్)
  • పచ్చి మిరపకాయలు -2
  • నూనె తగినంత

ఇన్స్టంట్ ఉత్తపమ్ | How to make Instant utapatam Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయ మరియు పచ్చి మిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి.
  2. ఒక బౌల్ లో బియ్యం పిండి, ఉప్మా రవ్వ ,పెరుగు,తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి కలుపుకోండి.
  3. బాగా పొంగాలంటే బేకింగ్ / వంట సోడా వేసి కలుపుకోండి.
  4. ఒక పెనం వేడి చేసుకొని, మందంగా దోస వేసుకోండి. ఒక చెంచాడు నూనె కూడా అన్ని వైపులా వేసుకొని కాల్చుకోండి. రెండు వేయిపుల కాల్చుకొన్న తరువాత ప్లేట్లో తీసుకొని మీకు నచ్చే పచ్చడి తో ఆరగించండి.
  5. రుచికరమైన ఉత్తపం చిటికెలో తయారు. మీరు చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

బాకింగ్ సోడా వేసుకోవడం తప్పని సరి కాదు. కారెట్ తురుము కూడా వేసుకోవచ్చును.కాస్త మందపాటి దోసెలు గా వేసుకుంటేనే బాగుంటాయి.

Reviews for Instant utapatam Recipe in Telugu (0)