సేమియా ఉప్మా | Semiya upma Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Semiya upma recipe in Telugu,సేమియా ఉప్మా, Tejaswi Yalamanchi
సేమియా ఉప్మాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    2

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

సేమియా ఉప్మా వంటకం

సేమియా ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semiya upma Recipe in Telugu )

  • సేమియా 2 కప్పులు
  • ఉల్లిపాయ 1 పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి
  • పచ్చి మిరపకాయ - 2 ముక్కులుగా తరిగినవి
  • ఎండు మిరపకాయ -1 మధ్యకి తుంచండి
  • నూనె : 1 టేబుల్ స్పూన్
  • నీళ్లు : 2 కప్పులు
  • ఆవాలు : 1 టీస్పూన్
  • పల్లీలు / వేరుసెనెగలు : 1 టీస్పూన్
  • మిన పప్పు : 1 టీస్పూన్
  • ఉప్పు : రుచికి సరిపడ
  • కరివేపాకు : ఒక రెమ్మ

సేమియా ఉప్మా | How to make Semiya upma Recipe in Telugu

  1. ముందుగా ఒక పాన్ లో ఒక చిన్న చెంచాడు నూనే వేసుకుని సేమియాని రెండు నిమిషాల పాటు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
  2. వేయించటం వలన సేమియా ముద్దలా కాక , విడి విడి గా వస్తుంది.
  3. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మిన పప్పు, వేరు సెనెగలు వేసి వేయించి దానిలో కరివేపాకు ,ఉలిపాయ,పచ్చి మిరపకాయ ముక్కలు ,ఎండు మిర్చి, వేసి వేయించండి.
  4. తరవాత నీళ్లు పోసి, బాగా మరిగాక దానీలో ఉప్పు మరియు వేయించిన సేమియా వేసి నీరు ఇగిరి దాక ఉడికించండి.
  5. దీనితో ఎంతో రుచికరమైన సెమియా ఉప్మా తయారు. అందరూ ప్రయత్నించి సంతృప్తి చెందండి.

నా చిట్కా:

వియించిన సేమీయ దొరికితే మరలా వేయించాల్సిన పనిలేదు అదే మామూలు సెమియా వాడుతున్నట్లైతే వియించుకోండి.

Reviews for Semiya upma Recipe in Telugu (0)