పాలక్ పనీర్ | Palak paneer Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak paneer recipe in Telugu,పాలక్ పనీర్, Sree Vaishnavi
పాలక్ పనీర్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    16

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పాలక్ పనీర్ వంటకం

పాలక్ పనీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak paneer Recipe in Telugu )

  • పాలకూర - 1 కట్ట
  • పన్నీర్ - 1/2 కప్
  • టమొటా-2
  • ఉల్లిపాయ - 1
  • పచ్చి మిర్చి -2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-1/2 స్పూన్
  • జీలకర్ర -1/2 స్పూన్
  • చెక్క-2 ముక్కలు
  • ఏలకులు -3
  • లవంగాలు - 3
  • కసూరి మేతి -1/4 స్పూన్
  • పసుపు -1/4 స్పూన్
  • గరం మసాల-1/4 స్పూన్
  • ధనియాల పొడి -1/4 స్పూన్
  • జీలకర్ర-1/4 స్పూన్
  • ఎర్ర కారం -1/4 స్పూన్
  • నూనె -4 టేబుల్ స్పూన్

పాలక్ పనీర్ | How to make Palak paneer Recipe in Telugu

  1. ఒక గిన్నెలో పాలకూర వేసి ,కూర మునిగేలా నీరు వేసి మూత పెట్టకుండా బాగా ఉడికించాలి.
  2. తరువాత నీరు వాడ్చేసి పాలకూర మాత్రమే గ్రైండ్ చేయాలి.
  3. ఉల్లిపాయలు,టమాటో,పచ్చి మిర్చి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
  4. బాణలి లో 4 స్పూన్స్ నూనె వేసి, జీలకర్ర, ఏలకులు, లవంగాలు, చెక్క, కసూరి మేతి వేసి వేయించాలి
  5. తరువాత వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.
  6. తరువాత ఉల్లిపాయలు వేసి ఎర్ర గా వేయించాలి.
  7. తరువాత టమొటా, పచ్చి మిర్చి వేసి ఎర్ర గా వేయించాలి.
  8. తరువాత పసుపు, ఎర్ర కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి
  9. తరువాత గ్రైండ్ చేసిన పాలకూర వేసి బాగా కలిపి ఉడికించాలి.
  10. పనీర్ ముక్కలు వేసి 10 నిముషాలు ఉడికించుకోవాలి
  11. అంతే వేడి వేడి రోటి తో సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

పాలకూర ఉడికించేటపుడు మూత పెట్టకూడదు పెడితే నల్ల గా అయ్యిపోతుంది

Reviews for Palak paneer Recipe in Telugu (0)