బటర్ చికెన్ మసాలా | Butter chicken masala Recipe in Telugu

ద్వారా Kathi Mamatha  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Butter chicken masala recipe in Telugu,బటర్ చికెన్  మసాలా, Kathi Mamatha
బటర్ చికెన్ మసాలాby Kathi Mamatha
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

బటర్ చికెన్ మసాలా వంటకం

బటర్ చికెన్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Butter chicken masala Recipe in Telugu )

  • చికెన్ 500gm
  • బటర్ 2 చెంచాలు
  • నూనె 1 చెంచా
  • ఉల్లిపాయలు 2 మధ్యరకం
  • టమాటలు 2
  • దాల్చిన చెక్క : అరా అంగుళం ముక్క
  • కారం 1 1/2 చెంచాలు
  • ధనియాల పొడి 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • జీడిపప్పులు 5-6
  • పాలు 1 కప్పు
  • ఉప్పు రుచికి తగినంత
  • లవంగాలు 2
  • ఇలాయిచి 1
  • మిరియాలు 4
  • బిర్యాని ఆకు 1
  • అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా

బటర్ చికెన్ మసాలా | How to make Butter chicken masala Recipe in Telugu

  1. పెద్ద మూకుడు తీసుకొని వేడి చేసి అందులో ఒక చెంచాడు నూనె వేసుకోండి.
  2. నూనె వేడెక్కాక అందులో ఇలాయిచి , దాల్చిన చెక్క, లవంగాలు,బిర్యాని ఆకు మరియు మిరియాలు వేసి వేగనివ్వండి.
  3. గరం మసాలా దినుసులు వేగాక అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి ఆ పైన టమాటో ముక్కలు కూడా వేసి మగ్గా నివ్వండి , ఆ తరువాత జీడిపప్పులు వేసి వేయించుకొని స్టవ్ కట్టే యండి .
  4. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాస్య టమాటా ముష్రామాని చల్లారనివ్వండి ఆ పైన మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోండి .
  5. మరొక మూకుడు ని బటర్ వేసి వేడి చేసుకోండి ఆ తరువాత చికెన్ ముక్కలు వేసి కాస్త ఉడికించుకోండి .
  6. చికెన్ ముక్కలు కాస్త ఉడికిన తరువాత అందులో కరం పొడి, ఉప్పు వేసి మరి కాస్త సేపు ఉడికించుకొని రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని వేసి మంచిగా కలుపుకోండి .
  7. ఇప్పుడు ఇందులో పాలు మరియు నీళ్లు పోసి మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి.
  8. ఆఖరిగా ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే బటర్ చికెన్ రెసిపీ తయారు. మీరు చేసుకొని ఆనందించండి .

Reviews for Butter chicken masala Recipe in Telugu (0)