మసాలా వంకాయ కూర. | Masala bhengan Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala bhengan recipe in Telugu,మసాలా వంకాయ కూర., Sree Vaishnavi
మసాలా వంకాయ కూర.by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మసాలా వంకాయ కూర. వంటకం

మసాలా వంకాయ కూర. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala bhengan Recipe in Telugu )

  • వంకాయలు 1/2 కేజి
  • 2 కప్పుల కోసుకున్న ఉల్లిపాయముక్కలు
  • 3/4 కప్పు నూనె
  • 2 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
  • 2 చెంచాలు గరమసాలా
  • 5 మిరియాలు
  • 2 చెంచాలు కాజు పేస్ట్
  • 2 చెంచాలు క్రీం
  • ఉప్పు తగినంత

మసాలా వంకాయ కూర. | How to make Masala bhengan Recipe in Telugu

  1. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో నూనె వేసుకొని వేడిచెసుకోవాలి
  2. తరువాత కోసుకున్న ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకోవాలి.
  3. అల్లం వెల్లుల్లి ముద్ద + గరమసాలా + మిరియాలు వేసుకొని వెయించి
  4. తరువాత స్టవ్ మీదనుండి దించివేసి చల్లార్చుకోవాలి
  5. చల్లారిన తరువాత మిక్సీ చేసుకోవాలి.
  6. వంకాయలను కడిగి ముక్కలుగా కోసుకోవాలి
  7. బాండిలొ నూనె వేసుకొని తరిగిన వంకాయలను వేసుకొని వేయించాలి.
  8. వేగాక మిక్సీ చెసుకున్న మసాల + కాజు పేస్ట్ వేయాలి బాగా వేగాక
  9. 2 చెంచాలు క్రీం మరియు ఉప్పు కారం వేసుకొని 10 నిముషములు చిన్న మంట మీద వుడికిస్తే మసాలా వంకాయ కూర రడి .

Reviews for Masala bhengan Recipe in Telugu (0)