సొరకాయ చివ్వు కూర | Bottle gourd curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottle gourd curry recipe in Telugu,సొరకాయ చివ్వు కూర, Sree Vaishnavi
సొరకాయ చివ్వు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

సొరకాయ చివ్వు కూర వంటకం

సొరకాయ చివ్వు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle gourd curry Recipe in Telugu )

  • సొరకాయ 1
  • ఉల్లిపాయ 2
  • టమాట 5
  • పచ్చిమిర్చి 2
  • నూనె 5 చెంచాలు
  • కారం 1 1/2 చెంచా
  • ఉప్పు తగినంత
  • పంచదార 1/2 చెంచా
  • చింతపండు రసం కొంచెం
  • జీలకర్ర 1 చెంచా
  • ఎండుమిరపకాయలు 3
  • ధనియాలు 1. చెంచా

సొరకాయ చివ్వు కూర | How to make Bottle gourd curry Recipe in Telugu

  1. ముందుగా సొరకాయ ను పొట్టు తీయకుండా చక్రాలుగా తరుగుకోవాలి
  2. వాటిని ఉప్పు లో వేసి ఐదు నిముషాలు పక్కనపెట్టుకోవాలి
  3. ఈలోపు ఉల్లిపాయలను టమాటాలు తరుగుకోవాలి
  4. ఇప్పుడు సొరకాయలోని నీళ్లు పిండేయాలి
  5. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో నూనె జీలకర్ర వేయించి సొరకాయను కూడా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  6. ఈలోపు ఒక మిక్సీ జార్ లో పచ్చి ఉల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం పంచదార చింతపండు రసం ధనియాల పొడి గరం మసాలా టమాటా వేసి పేస్ట్ చేసుకోవాలి
  7. ఇప్పుడు సొరకాయ ముక్కలని వేగిన తరువాత పక్కన పెట్టుకోవాలి
  8. ఒక బాణీ పెట్టి మళ్ళి నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయలు వేసి వేయించాలి
  9. అందులో తయారు చేసిన పేస్ట్ వేసి వేయించుకోవాలి
  10. అందులో నూనె తేలిన తరువాత సొరకాయ ముక్కలు వేసి మరో కొంచెం సేపు ఉడికించుకోవాలి అంతే

నా చిట్కా:

సొరకాయ ఉప్పు వేసి నీళ్లు మొత్తం తీసేయాలి

Reviews for Bottle gourd curry Recipe in Telugu (0)