అరటికాయ వేపుడు | Raw banana fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  4th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw banana fry recipe in Telugu,అరటికాయ వేపుడు, Tejaswi Yalamanchi
అరటికాయ వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

అరటికాయ వేపుడు వంటకం

అరటికాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw banana fry Recipe in Telugu )

  • అరటికాయలు 2
  • తరిగిన ఉల్లిపాయ 1
  • తరిగిన మిర్చి 1
  • ఉప్పు 1 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • కారం 1 చెంచా
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • మినపప్పు 1/4 చెంచా
  • పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  • ఎండుమిరపకాయ 1
  • కార్వేపకు 1 రెమ్మ
  • నునే 5 చెంచాలు
  • నీరు 2 గ్లాసులు

అరటికాయ వేపుడు | How to make Raw banana fry Recipe in Telugu

  1. ముందుగా అరటికాయ ని కుక్కర్ లో 2 కుతాల వరకు నీరు పోసి ఉడికించండి
  2. కుక్కర్ లో ఆవిరి పోయాక తీసి అరటికాయని చిన్న ముక్కలు గా చేస్కోండి
  3. ఇప్పుడు పోయి పైన ఒక గిన్నె పెట్టి దానిలో నునే వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర, మినపప్పు, పచ్చి సేనగాపప్పు, కార్వేపకు,ఎండుమిరపకాయ వేసి అవి వేగాక
  4. ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు,పసుపు వేసి వేయించండి
  5. అవి వేగాక అరటికాయ ముక్కలని వేసి వేయించండి
  6. అవి వేగాక కారం వేయి 2 నిమిషాలు ఉంచి దించేయండి

నా చిట్కా:

అరటికాయ జిగురు గా ఉన్నట్టు ఉంటే వేపుడు చివరగా బియ్యం పిండి కొంచెం వేస్తే వెయిస్తే పొడి పొడి గా వేపుడు వొస్తుంది

Reviews for Raw banana fry Recipe in Telugu (0)