ములకాయ దోసకాయ టమోటా గుజ్జు కూర | Drumstick cucumber tamota curry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  8th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Drumstick cucumber tamota curry recipe in Telugu,ములకాయ దోసకాయ టమోటా గుజ్జు కూర, Tejaswi Yalamanchi
ములకాయ దోసకాయ టమోటా గుజ్జు కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

ములకాయ దోసకాయ టమోటా గుజ్జు కూర వంటకం

ములకాయ దోసకాయ టమోటా గుజ్జు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick cucumber tamota curry Recipe in Telugu )

  • దోసకాయ 1 చిన్నది
  • టమోటా 5
  • ఉల్లిపాయ 1
  • పచ్చి మిరపకాయ 2
  • నూనె 4 చంచాలు
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  • మినప్పప్పు 1/4 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • ఉప్పు 1 1/4 చెంచా
  • కారం 1 1/2 చెంచా
  • కార్వేపకు 2 రెమ్మలు

ములకాయ దోసకాయ టమోటా గుజ్జు కూర | How to make Drumstick cucumber tamota curry Recipe in Telugu

  1. ముందుగా దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా కడిగి ముక్కలు చేసి పెట్టుకోండి
  2. ఇప్పుడు పోయి మీద ఒక గిన్నె పెట్టుకుని అది వేడయ్యాక దాంట్లో నునె వేసి కగానీవండి
  3. నూనె వేడయ్యాక తాలింపు వేసుకోండి అనగా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు తో
  4. తాలింపు వేగాక ఉల్లి పాయలు పచ్చిమిరపకాయ ములక్కాయ ముక్కలను గిన్నెలో వేసుకొండి
  5. వాటిలో ఉప్పు పసుపు వేసుకోండి కలిపి వేగ ఇవ్వండి
  6. మూత పెట్టి ఒక పది నిమిషాలు వేగనివ్వాలి
  7. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి చివరిగా ఇలా వేగాలి
  8. పైవాటిలో ముక్కలుగా చేసుకున్న టమాటా దోసకాయ ముక్కల్ని వేసి కలుపుకొని వాటిని ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి
  9. మూత పెట్టి మగ్గనివాలి
  10. మధ్య మధ్య లో కలుపుతూ ఉండండి దోసకాయ టమోటా బాగా నీరు వదులుతాయి
  11. చివరికి కారం వేసుకోండి కలపండి
  12. ఒక 5 నిమిషాలు తర్వాత దించేయండి.కూర తయారు

Reviews for Drumstick cucumber tamota curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo