సకినాలు | Sakinam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sakinam recipe in Telugu,సకినాలు, Sree Vaishnavi
సకినాలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సకినాలు వంటకం

సకినాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sakinam Recipe in Telugu )

  • 3 కప్పుల తడి బియ్యంపిండి
  • 1 కప్పు నువ్వులు
  • ఉప్పు తగినంత
  • వాము 3 చెంచాలు
  • నూనె వేయించడానికి సరిపడా
  • నీళ్లు తగినంత

సకినాలు | How to make Sakinam Recipe in Telugu

  1. ముందుగా బియ్యని నీళ్లలో బాగా కడుగుకోవాలి (దానిని 4-5 సార్లు బాగా కడుగుకోవాలి )
  2. దానిని 3 గంటలు నానబెట్టుకోవాలి
  3. అది నానిన తరువాత నీళ్లు శుభ్రంగా వాడుచుకొని మెత్తగా పిండి ల మర పట్టించుకోవాలి
  4. ఇప్పుడు పిండి లో ఉప్పు నూవ్వులు వాము వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో నీళ్లు పోసుకొని చపాతి పిండి కన్నా కొంచెం పల్చగా కలుపుకోవాలి (బజ్జి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి)
  6. ఇప్పుడు ఒక తడి బట్ట తీసుకోవాలి
  7. తరువాత ఆ పిండి ని చేతి నిండా తీసుకోవాలి
  8. దానిని రెండు వేళ్ళ మధ్యలో నుంచి తిప్పుకుంటూ బట్ట మీద చుట్టుకోవాలి అలా 30 చుట్లు చుట్టుకోవాలి
  9. అది కొంచెం ఆరాక ఒక పెళ్లెం సహాయం తో తీసుకోవాలి
  10. ఈ లోపు ఒక పెద్ద మూకుడు లో నూనె కాగాబెట్టుకోవాలి
  11. నూనె కాగాక ఆ సకినం ని మెల్లగా నూనె లో వేసుకోవాలి
  12. అది వేగిన తరువాత అట్ల పుల్ల సహాయంతో తిరగవేసుకోవాలి
  13. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి దానిని మళ్ళి అట్ల పుల్లతో బయటకి తీసుకోవాలి అంతే

నా చిట్కా:

పిండిని నీళ్లతో కాకుండ పాలతో కలుపుకోవచ్చు

Reviews for Sakinam Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo