కారం మురుకులు | Spicy muruku Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spicy muruku recipe in Telugu,కారం మురుకులు, Sree Vaishnavi
కారం మురుకులుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    9

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

కారం మురుకులు వంటకం

కారం మురుకులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy muruku Recipe in Telugu )

  • బియ్యంపిండి-2 కప్స్
  • జీలకర్ర--1 చెంచా
  • ఉప్పు---తగినంత
  • ఎర్ర కారం --1 1/2 చెంచా
  • ఇంగువ--1/2 చెంచా
  • నూనె--3 కప్స్(వేయించడానికి)

కారం మురుకులు | How to make Spicy muruku Recipe in Telugu

  1. పెద్ద గిన్నె లో బియ్యప్పిండి జీలకర్ర ఉప్పు ఎర్ర కారం ఇంగువ వేసి బాగా కలపాలి.
  2. తరువాత 5 లేక 7 స్పూన్స్ వేడి నూనె వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.
  3. పిండి నూనె లో కలిపినాక కొద్దిగా పిండి చేతితో పట్టుకుంటే ముద్దలాగా లా అతుక్కోవాలి.
  4. పొడి పొడి గా పడిపోకుండా ఉండాలి.(ఒకవేల పిండి పొడి పోడి గా రాలుతుంటే కొద్దిగా నూనే వేసుకోవాలి)
  5. తరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తు గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
  6. తరువాత నూనె వేడికి పెట్టాలి
  7. తరువాత కొద్దిగా పిండి తీసుకొని మురుకుల గొట్టములో వేసి వేడి నూనె లో పిండాలి.
  8. మీకు నచ్చిన విధంగా మురుకల ప్లేట్స్ లో పెట్టి స్టార్ వేసుకోవచ్చు
  9. రెండువైపులా మురుకులను పచ్చిదనం పోయేలా వేయించాలి.
  10. వేయించిన మురుకులను ప్లేట్ లో పేపర్ వేసి పేపర్ మీద తీయాలి.(పేపర్ లో వేయడం వల్ల ఎక్కువగా ఉండే నూనె పేపర్ పీల్చుకుంటుంది).
  11. ఎంతో రుచిగా ఉండే కరకరలాడే బియ్యప్పిండి మురుకులు /జంతికలు రెడి.
  12. ఇవి డబ్బాలో వేసుకోని పెట్టుకుంటే నెల రోజులదాక నిల్వ ఉంటాయి

నా చిట్కా:

ఇవి డబ్బాలో వేసుకోని పెట్టుకుంటే నెల రోజులదాక నిల్వ ఉంటాయి

Reviews for Spicy muruku Recipe in Telugu (0)