పెసరపప్పు కచోరి | Khasta kachori Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Khasta kachori recipe in Telugu,పెసరపప్పు కచోరి, Sree Vaishnavi
పెసరపప్పు కచోరిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    2

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

పెసరపప్పు కచోరి వంటకం

పెసరపప్పు కచోరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Khasta kachori Recipe in Telugu )

  • పెసరపప్పు 1/2 కప్
  • మైదా పిండి 1 కప్
  • బొంబాయి రవ్వ 2-3 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • వెన్న 1-2 చెంచాలు
  • కారం 1 చెంచా
  • పచ్చిమిర్చి 1-2
  • నూనె వేయించడానికి సరిపడ
  • గరం మసాలా 1 చెంచా
  • ఆంచూర్ 1/2 చెంచా
  • సెనగపిండి 2-3 చెంచాలు
  • ఆవాలు 1 చెంచాలు
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • పసుపు చిటికెడు

పెసరపప్పు కచోరి | How to make Khasta kachori Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా పిండి,వెన్న ఉప్పు,వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో బొంబాయి రవ్వ,నీళ్లు పోసి చపాతీ పిండి ల కలుపుకోవాలి
  3. దాని మీద ఒక తడి బట్ట పెట్టి రెండు గంటలు నాననివ్వాలి
  4. ఇప్పుడు ఒక బాండి లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. అందులో ఉప్పు,కారం,గరం మసాలా,ఆంచూర్ వేసి వేయించాలి
  6. అవి వేగిన తరువాత సెనగపిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
  7. అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి 3-4 నిమిషాలు వేయించి చల్లార్చుకోవాలి
  8. ఇప్పుడు ముందుగా కలిపిన పిండి ని తీసుకొని చిన్న ఉండ తీసుకొని దానిలో పెసరపప్పు మిశ్రమం వేసి వత్తుకోవాలి
  9. ఇప్పుడు పొయ్యి పై నూనె వేసుకొని కాచుకోవాలి
  10. అది కాగిన తరువాత కచోరి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  11. దీనిని చింతపండు పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది

నా చిట్కా:

పిండి కలిపేటప్పుడు కాగిన నూనె వేసుకుంటే గుల్లగ వస్తాయి మరియు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి

Reviews for Khasta kachori Recipe in Telugu (0)