చిట్టి చెగోడీలు | Finger rings Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Finger rings recipe in Telugu,చిట్టి చెగోడీలు, Sree Vaishnavi
చిట్టి చెగోడీలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

చిట్టి చెగోడీలు వంటకం

చిట్టి చెగోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Finger rings Recipe in Telugu )

  • మైదా 2 కప్పులు
  • బియ్యం పిండి 2 కప్పులు
  • వాము 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • నూనె వేయించటానికి తగినంత
  • పసుపు చిటికెడు

చిట్టి చెగోడీలు | How to make Finger rings Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలొ నీరు ఎసరు పెట్టుకోవాలి
  2. నీరు మరిగాక వాము + ఉప్పు తగినంత వేసుకొని + కారం కూడా వేసుకొని
  3. మైదా + బియ్యం పిండి మరియు ఒక చెంచా నూనె వేసుకుని బాగా పిండి అంతా బాగా కలిసెలా కలిపి స్టవ్వ్ ఆపివెసుకోవాలి.
  4. పిండిని చల్లారనిచ్చి తరువాత బాగా కలిపి
  5. సన్నగా తాడులా వొత్తుకొని మన చూపుడు వేలు రింగు లా చుట్టుకొని ఒకపక్కన వుంచుకోవాలి
  6. ఇప్పుడు ఒక బాండి లో నూనె వేయించటానికి తగినంత వేసుకొని వేడిగా అయ్యాకా
  7. మనం ముందుగా చుట్టుకొని వుంచుకున్న రింగులను వేసుకొని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
  8. అంతే మన చిట్టి చిట్టి చెగోడీలు తినటానికి రడీ.

Reviews for Finger rings Recipe in Telugu (0)