సొరకాయ బూరెలు | Bottle gourd vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottle gourd vada recipe in Telugu,సొరకాయ బూరెలు, Sree Vaishnavi
సొరకాయ బూరెలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సొరకాయ బూరెలు వంటకం

సొరకాయ బూరెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle gourd vada Recipe in Telugu )

  • బియ్యంపిండి 2 కప్పులు
  • సొరకాయ తురిమినది 1
  • ఉప్పు తగినంత
  • అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • పచ్చిమిర్చి 6-8
  • కొత్తిమీర తరిగినది 3 చెంచాలు
  • నూనె వేయించడానికి సరిపడ
  • ఉల్లిపాయ 1-2
  • కరివేపాకు 1 రెమ్మ

సొరకాయ బూరెలు | How to make Bottle gourd vada Recipe in Telugu

  1. ముందుగా సొరకాయని తొక్కు తీసి తురుముకోవాలి
  2. ఇప్పుడు ఒక మిక్సీ లో పచ్చిమిర్చి ,ఉప్పు జీలకర్ర ,కొత్తిమీర ,కరివేపాకు ,అల్లం వెల్లులి ముద్ద,ఉల్లిపాయ వేసి ముద్ద ల చేసుకోవాలి
  3. ఇప్పుడు ఈ ముద్దని సొరకాయ తురుము లో వేసుకొని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు అందులో బియ్యంపిండి వేసి కలుపుకోవాలి
  5. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని కాచుకోవాలి
  6. అది వేడి అయ్యాక సొరకాయ ముద్ద ని తీసుకొని వడ ల చేసుకోవాలి కరివేపాకు వేసుకొని
  7. దానిని వేడి నూనె లో వేసుకొని బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించుకోవాలి
  8. అంతే సొరకాయ బూరెలు తయారు

నా చిట్కా:

నీళ్లు పోసుకోకూడదు పిండి కలిపేటప్పుడు

Reviews for Bottle gourd vada Recipe in Telugu (0)